ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం

అనుష్క కీలక పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' షూటింగ్ పూర్తయింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. సియాటల్లో 'నిశ్శబ్దం' షూటింగ్ పూర్తయింది. అత్యంత ఉత్కంఠభరితమైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడానికి మేం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని ట్విట్టర్లో సోమవారం కోన వెంకట్ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ అమెరికాలోనే జరగనున్నాయి. తెలుగులో నిశ్శబ్దం'గా, తమిళ, హిందీ, ఆంగ్లంలో 'సైలెన్స్'గా విడుదల కానుంది. మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల..